భారతీయుడు2: కమల్ వాయిస్ ను అనుకరించిన బ్రహ్మానందం!

భారతీయుడు2: కమల్ వాయిస్ ను అనుకరించిన బ్రహ్మానందం!

Published on Jul 7, 2024 11:01 PM IST

యూనివర్సల్ స్టార్ హీరో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో, స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఇండియన్ 2. తెలుగులో భారతీయుడు 2 గా థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రం ఇండియన్ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కింది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించగా, బ్రహ్మానందం కూడా హాజరు అయ్యారు. ఈ వేడుకలో కమల్ హాసన్ వాయిస్ ను అనుకరించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

అందరికీ నమస్కారం. ఈరోజు నేను భారతీయుడు 2 లో యాక్ట్ చేశాను. ఇండియన్ 1 ను మీరందరూ హిట్ చేశారు. ఈ సినిమాకి అంతకంటే ఎక్కువ కష్టపడ్డాను. మన సౌత్ ఇండియన్స్ అందరూ ఎంతో ఆశీర్వదించారు, అభినందించారు, ఐ యాం సో హ్యాపీ. నాకు మాటలు ఎక్కువగా రావడం లేదు. ఎందుకంటే సంతోషంగా ఉంది. మనసంతా ఎక్కువగా హ్యాపీ గా ఉంది, ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాను. మీరందరూ ఈ సినిమాను సక్సెస్ చేస్తే నేను హ్యాపీ. ఆల్వేస్ యువర్ కమల్ హాసన్, థాంక్యూ అంటూ చెప్పుకొచ్చారు. ఈ రేంజ్ లో బ్రహ్మానందం కమల్ వాయిస్ తో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు