“భీమ్లానాయక్‌”లో బ్ర‌హ్మానందం లుక్ ఇదేనా?

Published on Dec 8, 2021 1:02 am IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-రానా దగ్గుబాటి హీరోలుగా మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియం’ చిత్రాన్ని సాగర్ కె చంద్ర “భీమ్లా నాయక్‌” పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో కామెడీ కింగ్ బ్ర‌హ్మానందం న‌టిస్తున్నాడన్న సంగతి తెలిసిండే. చాలా కాలం త‌రువాత బ్ర‌హ్మానందం న‌టిస్తున్న సినిమా కావ‌డంతో ఆయ‌న ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాలో బ్ర‌హ్మానందం లుక్ ఇదేనంటూ ఓ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇందులో బ్ర‌హ్మానందం పోలీస్ పాత్రలో కనిపిస్తునాడు. లెజండరీ కామెడీ కింగ్‌ను ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టు ఈ పోస్టర్ వచ్చింది. దీనిపై చిత్ర బృందం క్లారిటీ ఇవాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :