“బ్రహ్మస్త్ర” 25 రోజుల వరల్డ్ వైడ్ గ్రాస్ ఎంతంటే..!

Published on Oct 4, 2022 3:09 pm IST

బాలీవుడ్ నుంచి ఎంతో కాలం గా ఎదురు చూస్తున్న భారీ బడ్జెట్ చిత్రం “బ్రహ్మాస్త్ర” కోసం అందరికీ తెలిసిందే. బాలీవుడ్ స్టార్ జంట రణబీర్ కపూర్ మరియు ఆలియా భట్ లు హీరో హీరోయిన్స్ గా దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ చిత్రం ఈ ఏడాదికి అయితే బాలీవుడ్ నుంచి భారీ హిట్ అని చెప్పాలి. పాన్ ఇండియా లెవెల్లో సాలిడ్ వసూళ్లు అందుకుంటున్న ఈ చిత్రం ఇప్పుడు 25 రోజులకి చేరుకుంది.

ఇక ఈ 25 రోజుల్లో అయితే ఈ చిత్రం వసూళ్ల వివరాలు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ 25 రోజుల్లో అయితే ఈ చిత్రం 425 కోట్ల గ్రాస్ వసూలు చేసిందట. దీనితో మేకర్స్ ఈ రెస్పాన్స్ కి గాను ఆడియెన్స్ కి థాంక్స్ చెబుతున్నారు. ఇక ఈ భారీ చిత్రంలో అయితే షారుఖ్ ఖాన్ అలాగే అమితాబ్ బచ్చన్ లు కీలక పాత్రల్లో నటించగా మన తెలుగు నుంచి అక్కినేని నాగార్జున కూడా ఓ సాలిడ్ గెస్ట్ రోల్ లో నటించారు.

సంబంధిత సమాచారం :