“బ్రహ్మాస్త్రం” మేకర్స్ నుంచి ఓ ఆసక్తికర వీడియో.!

Published on Jul 13, 2022 12:30 pm IST

ఇప్పుడు పాన్ ఇండియా సినిమా నుంచి అనేక అంచనాలు నెలకొల్పుకొని రిలీజ్ కి సిద్ధం అవుతున్న బిగ్గెస్ట్ విజువల్ ట్రీట్ సినిమా “బ్రహ్మాస్త్ర”. బాలీవుడ్ నుంచి చాలా కాలం తర్వాత ఎన్నో అసలు నడుమ వస్తున్న అవైటెడ్ పాన్ ఇండియా సినిమా ఇదే. మరి ఈ సినిమాని తెలుగులో “బ్రహ్మాస్త్రం” గా రిలీజ్ చేస్తుండగా దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి రిలీజ్ చేస్తున్నారు.

మరి ఈ సినిమాలో రణబీర్ కపూర్ మరియు ఆలియా భట్ లు హీరో హీరోయిన్ లుగా నటించగా అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. అయితే ఇపుడు ఈ సినిమా దర్శకుని నుంచి ఓ ఇంట్రెస్టింగ్ వీడియో బయటకి వచ్చింది. అసలు తాను ఈ చిత్రాన్ని ఎందుకు తీశారు? ఈ బ్రహ్మాస్త్ర అంటే ఏమిటి? ఈ అస్త్రాలు, అస్త్ర వర్స్ అంటే ఏమిటి అనేవి ఎలా వచ్చాయి అనే వాటిని తాను రివీల్ చేసాడు.

మన పురాణాల్లో ఈ అస్త్రాలు కోసం ఉంది వీటి అన్నటికి గురువు బ్రహ్మాస్త్రం కాగా ఒకప్పుడు కొందరు మహా ఋషులు కలిసి మహా యాగం చెయ్యగా అనంత విశ్వం నుంచి ఒక స్వచ్ఛమైన శక్తి కిందకు వచ్చి ఒకొక్కరికి ఒకో శక్తివంతమైన అస్త్రాన్ని అందించింది. వాటిని వారు అప్పటి నుంచి వారి వంశపారంపర్యంగా ఇప్పటికీ ప్రస్తుత ప్రపంచంలో కూడా వాటి శక్తి కలిగిన వారు ఉన్నారు వారి కథనే ఇప్పుడు చెబుతున్నానని ఇందులో ఫస్ట్ సినిమా శివ నాకు ఎంతో ఇష్టమైనది అని తాను తెలిపాడు. మొత్తానికి అయితే ఇది కూడా మంచి ఆసక్తికరంగానే ఉందని చెప్పాలి.

సంబంధిత సమాచారం :