తెలుగులో “బ్రహ్మాస్త్రం” ట్రైలర్ కి మంచి రెస్పాన్స్.!

Published on Jun 16, 2022 3:39 pm IST


బాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మరియు మోస్ట్ ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్ ఏదన్నా ఉంది అంటే అది “బ్రహ్మాస్త్ర” సినిమా అనే చెప్పాలి. పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రంలో రణబీర్ కపూర్ హీరోగా ఆలియా భట్ హీరోయిన్ గా అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగులో “బ్రహ్మాస్త్రం” గా రిలీజ్ చేస్తున్నారు.

అయితే మేకర్స్ నిన్ననే ఈ సినిమా తాలూకా గ్రాండ్ విజువల్ ట్రీట్ థియేట్రికల్ ట్రైలర్ ని రిలీజ్ చేయగా దీనికి హిందీ రెస్పాన్స్ పక్కన పెడితే తెలుగులో ఈ చిత్రం ట్రైలర్ కి భారీ రెస్పాన్స్ రావడం గమనార్హం. ఈ ట్రైలర్ కి 24 గంటల్లో ఒక్క తెలుగులోనే 55 లక్షలకి పైగా వ్యూస్ రావడం ఈ సినిమాకి తెలుగులో ఉన్న అంచనాలకి ప్రామిసింగ్ అని చెప్పాలి.

చాలా కాలం నుంచి హిందీ సినిమాలు తెలుగులో నామ మాత్రంగానే రెస్పాన్స్ అందుకుంటున్నాయి. కానీ ఈ సినిమా అయితే అది బ్రేక్ చేసేలా ఉందనిపిస్తుంది. ఎలాగో రాజమౌళి నుంచి తెలుగులో ఈ సినిమా వస్తుంది కాబట్టి డెఫినెట్ గా మంచి రీచ్ ఉంటుంది. మరి రిలీజ్ అయ్యాక సినిమా వసూళ్లు ఎలా ఉంటాయో చూడాలి.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :