“బ్రహ్మాస్త్ర” కి ఆరోజు సాలిడ్ నంబర్స్..!

Published on Sep 21, 2022 9:59 am IST

బాలీవుడ్ సినిమా నుంచి ఎన్ని అంచనాలు నడుమ రిలీజ్ అయ్యిన లేటెస్ట్ భారీ సినిమా “బ్రహ్మాస్త్ర” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు అయాన్ ముఖర్జీ హీరో రణబీర్ కపూర్ అలాగే హీరోయిన్ ఆలియా భట్ లతో చేసిన ఈ చిత్రం ఇండియన్ సినిమా దగ్గర ఓ బిగ్గెస్ట్ విజువల్ డ్రామాగా వచ్చి భారీ ఓపెనింగ్స్ ని అందుకుంది.

అలా ఇప్పటి వరకు మేకర్స్ చెప్తున్నా దాని ప్రకారం భారీ వసూళ్లే అందుకున్న ఈ సినిమా ఇక ఈ ఇంటర్నేషనల్ సినిమా డే కి మాత్రం మరింత స్థాయిలో భారీ వసూళ్లు అందుకుంటుంది అని తెలుస్తుంది. ఆరోజు టికెట్ ధర 75 రూపాయలు మాత్రమే కావడంతో ఇప్పుడు నుంచే సాలిడ్ బుకింగ్స్ నమోదు అవుతున్నాయట.

దీనితో ఆరోజు మాత్రం ఈ చిత్రానికి హిందీలో సాలిడ్ వసూళ్లు నమోదు అవుతాయని అంటున్నారు. మరి ఆరోజు అయితే ఈ చిత్రానికి ఎలాంటి వసూళ్లు వస్తాయో చూడాలి. ఇక ఈ సినిమాలో నాగార్జున షారుఖ్ ఖాన్ అలాగే అమితాబ్ లాంటి బిగ్ స్టార్స్ కూడా కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం :