అత్యద్భుతంగా “బ్రహ్మాస్త్రం” థియేట్రికల్ ట్రైలర్ విజువల్స్.!

Published on Jun 15, 2022 11:03 am IST


బాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ గా ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్న చిత్రం “బ్రహ్మాస్త్ర”. తెలుగులో “బ్రహ్మాస్త్రం” పేరిట దిగ్గజ దర్శకుడు రాజమౌళి సమర్పణలో ఈ చిత్రం గ్రాండ్ గా విడుదల కాబోతుంది. అయితే బాలీవుడ్ స్టార్ జంట రణబీర్ కపూర్ మరియు ఆలియా భట్ లు నటించిన ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించాడు.

అయితే ఈ సినిమా నుంచి ఆడియెన్స్ ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్న అవైటెడ్ ట్రైలర్ ని అయితే మేకర్స్ ఇప్పుడు రిలీజ్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి గూస్ బంప్స్ వాయిస్ ఓవర్ తో ఉన్న ఈ ట్రైలర్ ఫస్ట్ షాట్ తోనే ఆడియెన్స్ ని మతి పోయేలా చేస్తుంది అని చెప్పాలి. సృష్టిలో ఉన్న పలు శక్తివంతమైన అస్త్రాలు వాటికి రారాజుగా పిలిచే “బ్రహ్మాస్త్రం” దానికి హీరో శివ పాత్రకి ఉన్న లింక్ ఏంటి ఇందులో ఆలియా భట్ తో ప్రేమ కథ వంటి అంశాలు ఒక గ్రేట్ ట్రీట్ లా కనిపిస్తున్నాయి.

ముఖ్యంగా ఈ ట్రైలర్ బిగ్గెస్ట్ హైలైట్ ఏదన్నా ఉంది అంటే అది వి ఎఫ్ ఎక్స్ అని చెప్పాలి. బహుశా ఇండియన్ సినిమా నుంచి ఇంత స్థాయిలో గ్రాఫిక్స్ తో అందులోని ఇంత అత్యద్భుతమైన విజువల్స్ తో రావడం అనేది మొదటి సారి కావచ్చు. దీనితో అయితే ఈ భారీ సినిమా హాలీవుడ్ రేంజ్ ట్రీట్ ని ఆడియెన్స్ కి ప్రామిస్ ఇస్తుంది.

బిగ్ బి అమితాబ్ కింగ్ నాగార్జునల పాత్రలు సినిమాలో కీలకంగా కనిపిస్తుండగా సినిమా అయితే మరో ప్రపంచంలోకి తీసుకెళ్లడం ఖాయం అనిపిస్తుంది. అయితే తెలుగు డబ్బింగ్ వరకు హీరో హీరోయిన్స్ విషయంలో కొత్త వాయిస్ ని యాడ్ చేస్తే బాగుండు అనిపించింది. మొత్తంగా చూస్తే “బ్రహ్మాస్త్రం పార్ట్ 1 శివ” పాన్ ఇండియా లెవెల్లో ఈ సెప్టెంబర్ 9 ఆడియెన్స్ ని మరో లోకంలోకి
తీసుకెళ్లడం గ్యారెంటీ అని చెప్పాలి.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :