వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి డేట్ ఫిక్స్ చేసుకున్న “బ్రహ్మాస్త్రం”!

Published on May 14, 2023 9:17 pm IST


బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ హీరోగా, అయాన్ ముఖర్జీ దర్శకత్వం లో తెరకెక్కిన ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ మూవీ బ్రహ్మాస్త్రం. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కూడా సాలిడ్ వసూళ్లను రాబట్టడం జరిగింది. ఈ చిత్రం ఇప్పుడు తెలుగు లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతోంది.

స్టార్ మా లో వచ్చే ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు ఈ చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రేక్షకుల ముందుకి రానుంది. అమితాబ్ బచ్చన్, అలియా భట్, మౌనీ రాయ్, అక్కినేని నాగార్జున కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి తనుజ్ టికు, ప్రితమ్ లు సంగీతం అందించారు. ఈ చిత్రం బుల్లితెర పై ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :