‘డీజే’ పట్ల బ్రాహ్మణుల పాజిటివ్ రియాక్షన్ !


అల్లు అర్జున్ – హరీష్ శంకర్ ల కాంబినేషన్లో రూపొందిన ‘దువ్వాడ జగన్నాథం’ చిత్రం గత శుక్రవారం విడుదలై మంచి ఓపెనింగ్స్ సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదలకు ముందు రిలీజైన పాటల విషయంలో చెలరేగిన దుమారంతో సినిమా విడుదల తర్వాత ఎలాంటి వివాదాలు తలెత్తుతాయో అని అభిమానులు కాస్త కంగారుపడ్డారు. కేవలం పాటలోని లిరిక్స్ అవమానకరంగా ఉన్నాయంటూ అభ్యంతరం తెలిపిన బ్రాహ్మణులు సినిమాలో ఏవైనా తేడాలు జరిగితే మరింత కోపోద్రిక్తులవుతారని , కాబట్టి అలాంటివేమీ సినిమాలో ఉండకూడదని ఫ్యాన్స్ అనుకున్నారు.

వాళ్ళు అనుకున్నట్టే సినిమా రిలీజయ్యాక ఎలాంటి వివాదాలు తలెత్తలేదు. స్వతహాగా బ్రాహ్మణుడైన దర్శకుడు హరీష్ శంకర్ సినిమాలో బ్రాహ్మణత్వాన్ని అవమానించేలా ఎలాంటి సన్నివేశాలు, డైలాగులు లేకుండా చూసుకున్నారు. దీంతో సినిమా చూసిన బ్రాహ్మణ సంఘ పెద్దలు కూడా సంతృప్తి చెంది ఎలాంటి అభ్యంతరాలు చెప్పలేదు. పైగా ఒక బ్రాహ్మణ యువకుడిని హీరోగా చూపినందుకు కొంత సంతోషిస్తున్నారు కూడ. దీంతో డీజే ఎలాంటి ఆటంకాలు లేకుండా థియేటర్లలో సాఫీగా సాగిపోతోంది.