బాడీలో దానికి ఇన్సూరెన్స్ చేయించుకుంది !

Published on Nov 14, 2021 11:32 pm IST

కొందరు ఇల్లు, కారును ఎలా అయితే బీమా చేయించుకుంటారో కొంద‌రు సెల‌బ్రిటీలు త‌మ శరీర భాగాలకు ఇన్సూరెన్స్ చేయించుకుంటారు. ఈ లిస్ట్ లో చాలామంది తారలు ఉన్నారు. తాజాగా బ్రెజిల్‌కు చెందిన మోడ‌ల్ నాథీ కిహారా కూడా త‌న బాడీలోని ఓ పార్ట్‌ ను ఏకంగా 13 కోట్ల రూపాయ‌ల‌కు ఇన్సూరెన్స్ చేయించుకుంది. అయితే, ఇంత‌కీ ఆమె తన బాడీలో ఏ పార్ట్ ఇన్సురెన్స్ చేయించుకుందో తెలుసా ?

ఆ మోడల్‌ త‌న పిరుదుల‌ను ఇన్సూరెన్స్ చేయించుకుంది. ఇదెక్కడి చోద్యం అని మీకు అనిపించవచ్చు. కానీ ప్రత్యేకంగా వాటికే ఎందుకు చేయించుకుంది అంటే.. ఆమెకు ఆమె పిరుదులే అందం అట. వాటి కారణంగానే ఆమె మిస్ బుమ్‌బుమ్ 2021 వ‌ర‌ల్డ్ టైటిల్‌ ను సొంతం చేసుకుంది. మొత్తానికి ఈ మోడల్ తన పిరుదుల వల్లే పేరు తెచ్చుకుంది. అందుకే వాటికి £1.3 మిలియన్లకు (సుమారు రూ. 13 కోట్లు) బీమా చేయించుకుంది.

సంబంధిత సమాచారం :