బ్రేక్ ఈవెన్ సాధించిన కిరణ్ అబ్బవరం “వినరో భాగ్యము విష్ణుకథ”

Published on Feb 24, 2023 9:02 pm IST

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తాజా చిత్రం వినరో భాగ్యము విష్ణు కథ తెలుగు ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించిన ఈ చిత్రంతో యంగ్ హీరో కిరణ్ దూసుకు పోతున్నాడు. ఈ చిత్రం ఆరు రోజుల్లో 9.6 కోట్లకు పైగా గ్రాస్‌తో బ్రేక్ ఈవెన్ మార్క్‌ను సాధించినట్లు చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది.

ఇది మంచి అచీవ్‌మెంట్, ఇంకా పెద్దగా రిలీజ్‌లు ఏవీ లేకపోవడం వల్ల సినిమా మరింత మెరుగ్గా వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. నర్తనశాల సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కశ్మీరా పరదేశి ఈ మల్టీ జానర్ సినిమాతో మళ్లీ టాలీవుడ్‌కి వచ్చింది. ఈ చిత్రం లో మురళీ శర్మ ఓ కీలక పాత్ర చేశాడు. GA2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాస్ నిర్మించిన ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :