మన టాలీవుడ్ దగ్గర ఉన్నటువంటి టాప్ మోస్ట్ స్టార్ నిర్మాతల్లో దిల్ రాజు అలాగే మైత్రి మూవీ మేకర్స్, నవీన్ యెర్నేని అలాగే యలమంచిలి రవి కూడా ఒకరని తెలిసిందే. మరి లేటెస్ట్ గా వీరి నిర్మాణంలో వచ్చిన సినిమాలు సంక్రాంతి కానుకగా రిలీజ్ వస్తే వాటిలో ఒకటి రికార్డ్ వసూళ్లు కూడా అందుకుంటుంది. అలాగే పుష్ప 2 అయితే ఇండియన్ ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసింది. అయితే ఈ హ్యాపీ మూమెంట్ లో ఓ షాకింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్ ఇపుడు బయటకి వచ్చింది.
ఈ తెల్లవారు జామున హైదరాబాద్ లో దిల్ రాజు సహా తన సోదరుడు శిరీష్ అలాగే తన కూతురు హన్సిత సహా హైదరాబాద్ లో ఉన్నటువంటి దిల్ రాజు ఇల్లు, మ్యాంగో కార్యాలయాల్లో మొత్తం ఐటీ దాడులు చేస్తున్న వార్తలు బ్రేకింగ్ గా మారాయి. దీనితో పాటుగా మైత్రి నిర్మాతల కార్యాలయాలపై కూడా దాడులు జరిగినట్టుగా బయటకి వచ్చింది. వీటిలో మొత్తం 8 చోట్ల ఏకంగా 55 మంది బృందం ఈ రైడ్ నగరం వ్యాప్తంగా చేసినట్లు తెలుస్తోంది. మరి దీనిపై మరింత సమాచారం బయటకు రావాల్సి ఉంది.