బ్రేకింగ్ : గాన కోకిల లతా మంగేష్కర్ కన్నుమూత.!

Published on Feb 6, 2022 9:59 am IST

గడిచిన రెండేళ్లలో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో తీవ్ర విషాదాన్ని నెలకొల్పిన కరోనా వైరస్ ఎందరో లెజెండరీ వ్యక్తులను కూడా తిరిగి రాని లోకాలకు తీసుకెళ్ళిపోయింది. మరి గత ఏడాది మన దేశానికి చెందిన లెజెండరీ గాయకులు ఎస్ ఫై బాల సుబ్రహ్మణ్యం ఈ కరోనా కారణంగానే ఆరోగ్యంక్షీణించి కన్ను మూసారు.

మరి ఈ ఏడాది ఆ లోటు తీరకుండానే మరో లెజెండరీ గాయకులూ భారత దేశ గాన కోకిలాగా గుర్తింపు తెచ్చుకున్న గాయని లతా మంగేష్కర్ ఈరోజు తన 92వ ఏట తుది శ్వాస విడిచారు. గత కొన్ని రోజులు కితమే కరోనా బారిన పడగా కొన్ని క్లిష్ట పరిస్థితులు తర్వాత కోలుకున్నారు అని వార్తలు రావడంతో అంతా కాస్త ఊపిరి పీల్చుకున్నారు.

కానీ మళ్ళీ ఆరోగ్యం బాగోక మళ్ళీ హాస్పిటల్ లో వెంటిలేటర్ పై చికిత్సకి వెళ్లారని వార్త రావడం కాస్త కంగారుగా అనిపించింది. మరి చివరకి ఈరోజు ఉదయం ముంబై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూసినట్టుగా నిర్ధారణ అయ్యింది. దీనితో భారతీయ సినిమా దగ్గర మరో ఎరా ముగిసింది.

మరి ఆవిడ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని అనేక మంది సినీ తారలు నివాళులు అర్పిస్తున్నారు. మా 123తెలుగు టీం కూడా ఆవిడ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటుంది. ఓం శాంతి.

సంబంధిత సమాచారం :