బ్రేకింగ్..వారి రాజీనామాలు ఆమోదించిన ‘మా’ ప్రెసిండెంట్ విష్ణు.!

Published on Dec 12, 2021 12:56 pm IST


గత కొన్ని వారాల కితం తెలుగు చలన చిత్ర పరిశ్రమ వద్ద జరిగినటువంటి మా ఎన్నికలు(మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) కోసం అందరికీ తెలిసిందే. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఎన్నికలు రికార్డు స్థాయిలో జరిగాయి. అలానే ఈ ఎన్నికల్లో ప్రధానంగా మంచు విష్ణు ప్యానల్ మరియు నటుడు ప్రకాష్ రాజ్ ల ప్యానల్ ల నడుమ గట్టి పోటీ జరిగింది.

తర్వాత ఫైనల్ గా మంచు విష్ణు ప్రెసిండెంట్ గా ఎన్నిక కావడం అలానే ఎన్నికలు జరగడం ఓటింగ్ పట్ల అసంతృప్తితో ప్రకాష్ రాజ్ ప్యానల్ మొత్తం రాజీనామాలు ఇచ్చేసారు. మరి ఇప్పుడు ఈ రాజీనామాలు అన్నీ కూడా ప్రెసిండెంట్ మంచు విష్ణు ఆమోదించినట్టుగా బ్రేకింగ్ న్యూస్ కన్ఫర్మ్ అయ్యింది. దాదాపు నెల రోజులు అందరినీ మళ్ళీ వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేసినా ఎవరూ కూడా రావడానికి ఇష్టపడలేదు అని అందుకే కొత్త సభ్యులని తీసుకోవాలని భావిస్తున్నట్టు తాజా సమాచారం.

సంబంధిత సమాచారం :