బ్రేకింగ్ : ఉదయనిధి స్టాలిన్ కి షాకిచ్చిన సుప్రీంకోర్టు.!

Published on Sep 22, 2023 12:55 pm IST

తమిళ నాట ప్రముఖ హీరో అలాగే రాజకీయ నాయకుడు మరియు సినీ డిస్ట్రిబ్యూటర్ కూడా అయినటువంటి నటుడు ఉదయనిధి స్టాలిన్ కోసం మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా తెలిసే ఉంటుంది. రీసెంట్ గా అయితే తాను నటించిన “నాయకుడు” చిత్రం కూడా తెలుగులో రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ కూడా అయ్యింది.

అయితే ఈ తర్వాత ఉదయనిధి స్టాలిన్ చేసిన పలు అనుచిత వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఓ వేదికపై తాను మాట్లాడుతూ సనాతన ధర్మం కోసం పలు ఊహించని సంచలన వ్యాఖ్యలు చేయడం ఇండియా వైడ్ గా కూడా పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి. దీంతో మన టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కౌంటర్ మాటు తాలూకా ఓల్డ్ వీడియో కూడా వైరల్ అయ్యింది.

అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు ఉదయనిధి స్టాలిన్ కి షాకిచ్చినట్టుగా ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ అయితే బయటకి వచ్చింది. సుప్రీంకోర్ట్ ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలకు గాను తనకి తమిళనాడు ప్రభుత్వానికి కూడా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసిందట. మరి వీటిపై ఉదయనిధి స్టాలిన్ ఎలాంటి వివరణ అందిస్తాడో అని అంతా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం :