బ్రేకింగ్ : చిరుతో సాలిడ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన రాధికా శరత్ కుమార్.!

Published on May 1, 2022 10:43 am IST


ప్రస్తుతం మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా పలు సాలిడ్ ప్రాజెక్ట్ లు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే లేటెస్ట్ గా తాను నటించిన భారీ సినిమా “ఆచార్య” కూడా రిలీజ్ అయ్యింది. ఇక ఇదిలా ఉండగా దీని తర్వాత మంచి లైనప్ ని సెట్ చేసుకున్న మెగాస్టార్ ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ని టేకప్ చేసినట్టుగా కన్ఫర్మ్ అయ్యిపోయింది.

దీనిని మెగాస్టార్ హీరోయిన్ ప్రముఖ సీనియర్ నటి అయినటువంటి రాధికా శరత్ కుమార్ కన్ఫర్మ్ చేశారు. తమ బ్యానర్ రాధన్ ప్రొడక్షన్ బ్యానర్ లో చిరు ఒక మాసివ్ ప్రాజెక్ట్ చేసుకుందుకు ఒప్పుకున్నారని కింగ్ ఆఫ్ మాసెస్ మెగాస్టార్ చిరంజీవితో ఓ బ్లాక్ బస్టర్ చెయ్యడానికి ఫ్యూచర్ లో సిద్ధంగా ఉన్నామని ఆమె తెలిపారు. దీనితో బ్రేకింగ్ అప్డేట్ వైరల్ గా మారిపోయింది. అలాగే దీనిపై మరిన్ని డీటెయిల్స్ మున్ముందు రానున్నాయి.

సంబంధిత సమాచారం :