బ్రేకింగ్ : రేణు దేశాయ్, అకీరా లకి కరోనా..అకీరా పరిస్థితే కాస్త.!

Published on Jan 11, 2022 11:06 am IST


ప్రస్తుతం కరోనా మూడో వేవ్ మన దేశంలో ఏ స్థాయిలో ఉందో చూస్తూనే ఉన్నాము. దేశ వ్యాప్తంగా కూడా భారీ స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా ఈసారి వేవ్ లో సౌత్ ఇండియన్ సినిమా దగ్గర అనేక మంది ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. అయితే ఇదిలా ఉండగా ఇప్పుడు మరో బ్యాడ్ న్యూస్ తెలిసింది.

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ మరియు వారి తనయుడు అకీరా నందన్ లు పాజిటివ్ అయ్యినట్టు రేణు దేశాయ్ ఇప్పుడు తెలిపారు. అయితే వారు గత కొన్ని రోజులు కితమే పాజిటివ్ కాగా ఇప్పుడు తాము కోలుకుంటున్నారు రేణు తెలిపారు.

మరి అంతే కాకుండా తాను ఆల్రెడీ రెండు డోసులు వాక్సిన్ చేయించుకున్నా మళ్ళీ పాజిటివ్ అయ్యానని తెలిపారు. మరి సరిగా అకిరా కి వాక్సిన్ చేయిద్దాం అనుకునే లోపు అతడికి రిపోర్ట్ పాజిటివ్ వచ్చింది అని తెలిపారు. ఇది బాధాకరం అని చెప్పాలి. మరి అకీరా త్వరగా కోలుకోవాలని మా 123తెలుగు యూనిట్ కోరుకుంటుంది.

సంబంధిత సమాచారం :