బ్రేకింగ్..తమ బంధంపై ఓ క్లారిటీ ఇచ్చేసిన చై – సామ్

Published on Oct 2, 2021 4:27 pm IST

గత కొన్ని రోజులుగా టాలీవుడ్ సినీ వర్గాల్లో హీరో హీరోయిన్ అక్కినేని నాగ చైతన్య మరియు సమంతా ల వైవాహిక బంధానికి సంబంధించే పలు ఊహించని వార్తలు వింటూనే ఉన్నాము. ఒకానొక దశలో వీరు విడిపోతున్నారు అనే టాక్ కూడా వినిపించింది. కానీ మధ్యలో వీరి ఇద్దరి మధ్య స్నేహపూర్వక మాటలే కనిపించడంతో అదేం లేదని అంతా అనుకున్నారు.

కానీ ఇప్పుడు అక్కినేని అభిమానులు సహా వారి అభిమానులకు సామ్ మరియు చైతు లు ఒక విషాద వార్తనే షేర్ చేశారు. ఇన్ని రోజులు నడుస్తున్న టాక్ కి ఎండ్ కార్డ్ వేస్తూ తాము తమ బి=వైవాహిక బంధం నుంచి విడిపోతున్నామని ప్రకటించారు. కానీ తమ మధ్య స్నేహ బంధం మాత్రం ఇలానే కొనసాగుతుంది అని తెలిపారు.

ఇంకా తమ అభిమానులు, మీడియా వారు తమ నిర్ణయంపై గౌరవించి సహకరించాలని విన్నవించుకున్నారు. ఏది ఏమైనప్పటికీ మాత్రం వీరి జంట ఇలా విడిపోవడం వారి అభిమానులకు చేదు వార్తే అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :