చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ని విజిట్ చేసిన బ్రిటిష్ డిప్యూటీ హై కమీషనర్

Published on Dec 3, 2022 8:00 pm IST


టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ మూవీస్ చేస్తోన్న విషయం తెలిసిందే. వీటిలో ముందుగా సంక్రాంతికి వాల్తేరు వీరయ్య రిలీజ్ కానుంది. ఇక ఇటు సినిమాలతో పాటు మొదటి నుండి పలు సామజిక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ తన ఉదారతని చాటుకుంటున్నారు మెగాస్టార్.

రక్తం అందక ఎవరూ చనిపోకూడదనే గొప్ప ఆలోచనతో కొన్నేళ్ల క్రితం ఆయన స్థాపించిన బ్లడ్ బ్యాంకు, అలానే మరణాంతరం నేత్ర దానం ద్వారా మరొకరికి చూపుని అందించవచ్చే సత్సంకల్పంతో నెలకొల్పిన ఐ బ్యాంకు, ఇక పలు సేవా కార్యక్రమాలతో కొనసాగుతున్న చారిటబుల్ ట్రస్ట్ తరచు ఎందరికో సహాయాన్ని అందిస్తున్నాయి. అయితే విషయం ఏమిటంటే, బ్రిటన్ కి చెందిన బ్రిటిష్ డిప్యూటీ హై కమీషనర్ మిస్టర్ గారేత్ విన్ ఒవేన్ కొద్దిసేపటి క్రితం చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ని సందర్శించి అక్కడ జరుగుతున్న కార్యక్రమాలను పరిశీలించి మెగాస్టార్ పై అభినందనలు కురిపించారు. అలానే 2022 వ సంవత్సరానికి గాను ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ గా అవార్డు అందుకున్న మెగాస్టార్ కి ఆయన శుభాకాంక్షలు తెలియచేసారు.

సంబంధిత సమాచారం :