“బ్రో” శాటిలైట్ రైట్స్ డీటైల్స్ ఇవే!

“బ్రో” శాటిలైట్ రైట్స్ డీటైల్స్ ఇవే!

Published on May 19, 2023 9:01 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ లు కలిసి నటిస్తున్న మూవీ బ్రో. ఈ మూవీ కి సంబందించిన మోషన్ పోస్టర్ నిన్న రిలీజ్ అయ్యింది దీనికి సోషల్ మీడియాలో సెన్సేషన్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ చిత్రం కి సంబంధించిన డిజిటల్ రైట్స్ డీటైల్స్ పై ఇప్పటికే క్లారిటీ వచ్చింది. ప్రముఖ ఓటిటి దిగ్గజం అయిన నెట్ ఫ్లిక్స్ ఇప్పటికే ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను మంచి ధరకు సొంతం చేసుకుంది. తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన శాటిలైట్ హక్కులపై ఒక క్లారిటీ వచ్చింది. జీ తెలుగు సినిమా యొక్క టీవీ రైట్స్ ను దక్కించుకుంది.

సముద్ర ఖని దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ, తనికెళ్ళ భరణి, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జులై 28, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు