మరో ప్రాజెక్ట్ కోసం కలిసిన “బ్రోచేవారెవరురా” త్రయం!

Published on Feb 6, 2023 12:00 pm IST

శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో దర్శకుడు వివేక్ ఆత్రేయ రూపొందించిన బ్రోచేవారెవరురా చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ సాధించింది. ఇప్పుడు మరో సినిమా కోసం ఈ త్రయం ఏకమైనట్లు తెలుస్తోంది. హుషారు ఫేమ్ హర్ష కొనుగంటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. ఇంకా పేరు పెట్టని ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ఈ నెలాఖరులో కేరళలో జరగనుందని సమాచారం.

జ‌రుగుతున్న షెడ్యూల్‌తో సినిమాను పూర్తి చేయాల‌ని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. హీరోయిన్, ఇతర వివరాలను మేకర్స్ ఇంకా వెల్లడించలేదు. యువి వంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సన్నీ ఎంఆర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన మరిన్ని వివరాలు రానున్న రోజుల్లో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం :