“లైగర్” బిటీఎస్ స్టిల్స్ ను రిలీజ్ చేసిన టీమ్!

Published on Dec 30, 2021 11:39 am IST

విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం లైగర్. ఈ చిత్రానికి సాలా క్రాస్ బ్రీడ్ అనేది ఉప శీర్షిక. ధర్మ ప్రొడక్షన్స్ మరియు పూరి కనెక్ట్స్ ల పై ఈ చిత్రాన్ని సంయుక్తం గా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు ఇప్పటికే విడుదల అయి ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన వరుస అప్డేట్స్ ను చిత్ర యూనిట్ విడుదల చేస్తూ ఫ్యాన్స్ ను, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం కి సంబంధించిన ఎక్స్ క్లూజివ్ బిటీఎస్ స్టిల్స్ ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేయడం జరిగింది. ఇందులో పూరి జగన్నాథ్ మరియు హీరో విజయ్ దేవరకొండ చర్చించుకుంటున్న ఫోటో ఒకటి మరియు విజయ్ కెమెరా తో ఉన్న ఫోటో ఒకటి షేర్ చేయడం జరిగింది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా అనన్య పాండే నటిస్తుంది. ప్రముఖ లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ మరొక కీలక పాత్ర లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :