థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంటున్న “బడ్డీ” గ్లింప్స్!

థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంటున్న “బడ్డీ” గ్లింప్స్!

Published on May 30, 2023 6:07 PM IST

చివరిసారిగా ఊర్వశివో రాక్షశివో సినిమాలో నటించిన అల్లు శిరీష్ తన తదుపరి ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలను ఈరోజు ప్రకటించారు. బడ్డీ అనే టైటిల్‌తో, మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు ఒక గ్లింప్స్ వీడియోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. రౌడీ ముఠా ఒక టెడ్డీని వెంబడిస్తుంది మరియు దానిని చంపడమే వారి లక్ష్యం. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, ఈ టెడ్డీ సాధారణ జీవిలా తిరుగుతుంది. ఇది ఎలా సాధ్యపడుతుంది? ఈ రౌడీలు ఆ టెడ్డీని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? దాన్ని కాపాడేందుకు అల్లు శిరీష్ ఎందుకు ప్రయత్నిస్తున్నాడు?

గ్లింప్స్ వీడియో ఈ ప్రశ్నలను లేవనెత్తుతుంది. టెడ్డీ మెషిన్ గన్‌తో రౌడీలను కాల్చడం సన్నివేశంతో ఇది ముగుస్తుంది. సామ్ ఆంటోన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. స్టూడియో గ్రీన్ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై కె.ఇ జ్ఞానవేల్రాజా, ఆధన జ్ఞానవేల్రాజా బడ్డీని నిర్మిస్తున్నారు. అజ్మల్ అమీర్, ప్రిషా రాజేష్ సింగ్, ముఖేష్ కుమార్, మహమ్మద్ అలీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హిప్ హాప్ తమిజా ఈ సినిమా కి సంగీత దర్శకుడు గా వ్యవహరిస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు