చరణ్ సినిమాకి శంకర్ లెక్క ఒకటి, దిల్ రాజు లెక్క ఒకటి అట!

Published on Sep 29, 2021 6:10 pm IST


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఐకానిక్ దర్శకుడు శంకర్ లా కాంబోలో ఓ సినిమా అనౌన్స్ అయ్యినప్పుడే దానిపై విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. మరి అక్కడ నుంచి వాటికి ఏమాత్రం తగ్గకుండా చాలా గ్ర్యాండ్ గానే ఈ సినిమా ఓపెనింగ్ ని కూడా మేకర్స్ ప్లాన్ చేశారు. మొత్తం పాన్ ఇండియన్ లెవెల్లో శంకర్ తో నిర్మాత దిల్ రాజు తన బ్యానర్ నుంచి 50వ సినిమాగా దీనిని ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గా ప్లాన్ చేశారు.

అయితే శంకర్ సినిమాలు అంటే ఆ గ్రాండియర్ కి తగ్గట్టుగా బడ్జెట్ కూడా ఇంకో లెవెల్లో ఉంటుంది. వీటిపైనే తన సినిమాల విషయంలో పలు మార్లు విషయాలు కూడా బయటకి వస్తాయి. అలానే ఈ సినిమా విషయంలో కూడా ఓ టాక్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ సినిమాకి గాను శంకర్ మొత్తం 200 కోట్లు క్వోట్ చేస్తుండగా దిల్ రాజు మాత్రం 170 కోట్లు అంటున్నారట.

మరి ఇందులో ఎంతమేర నిజముందో కానీ బడ్జెట్ పరంగా అయితే మాత్రం దిల్ రాజు పక్కాగా ఉంటారు. అందులో భాగంగానే సినిమా స్టార్టింగ్ కి ముందే దీనిపై శంకర్ తో పలుమార్లు కీలక చర్చలు కూడా జరిపారు. మరి దీనిలో ఎంతవరకు నిజముందో తెలియాలి.

సంబంధిత సమాచారం :