రజినీ సినిమాకి రూ.350 కోట్లు చాలడం లేదట !

2nd, December 2016 - 03:40:05 PM

robo2
2010 లో విడుదలై సంచలన విజయం సాధించిన ‘రోబో’ కు సీక్వెల్ గా ‘2.0’ రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. రజనీకాంత్, శంకర్ ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో, ప్రేక్షకుల్లో మొదటి నుండి భారీ అంచనాలున్నాయి. పైగా ఇటీవలే గ్రాండ్ గా రిలీజైన త్రీడి ఫస్ట్ లుక్స్ ఆ అంచనాలను మరింతగా పెంచాయి. అందుకే ఈ అంచనాలకు అందుకునేలా ఉండాలని సినిమాను భారీ బడ్జెట్ చాలా గ్రాండ్ గా నిర్మిస్తున్నాడు శంకర్. శంకర్ విజన్ కు తగ్గట్టే నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఈ ప్రాజెక్టుకి రూ. 350 కోట్ల భారీ బడ్జెట్ ను కేటాయించింది.

ఈ బడ్జెట్ తో ఈ చిత్రం ఇండియాలోనే అత్యంత హెవీ బడ్జెట్ తో రూపొందుతున్న సినిమాగా పెరుగాంచింది. ఇంత పెద్ద బడ్జెట్ కేటాయించినా అది ఈ సినిమాకి చాలడం లేదు. సినిమాకి ముఖ్యమైన విఎఫ్ఎక్స్ పనులు ముందు అనుకున్న దాని కంటే మరింత మెరుగ్గా చేయడానికి ఇంకో రూ.50 కోట్లు అదనంగా వెచ్చించాలని డిసైడయ్యారట. ఈ దాంతో బడ్జెట్ కాస్త రూ.400 కోట్లకు చేరింది. మొత్తం 6 కు పైగా భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా వచ్చే సంవత్సరం దీపావళికి రిలీజ్ చేయనున్నారు. యామీ జాక్సన్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు.