రామ్ “ది వారియర్” నుండి బుల్లెట్ సాంగ్ స్నేక్ పీక్ విడుదల!

Published on Apr 20, 2022 5:00 pm IST

రామ్ పోతినేని హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ది వారియర్. ఈ చిత్రం లో రామ్ సరసన హీరోయిన్ గా కృతి శెట్టి నటిస్తుంది. ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకం పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ను అనౌన్స్ చేసిన అప్పటి నుండి సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం నుండి బుల్లెట్ సాంగ్ ను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

తాజాగా ఈ పాటకు సంబందించిన స్నేక్ పీక్ ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ పాటను స్టార్ హీరో శింబు పాడటం జరిగింది. పూర్తి పాటను ఏప్రిల్ 22 న సాయంత్రం 5:45 గంటలకు విడుదల చేయనున్నారు మేకర్స్. ఈ స్నేక్ పీక్ తోనే పాటను ఎంతో క్రేజ్ వచ్చింది. ఈ చిత్రం లో ఆది పినిశెట్టి, అక్షర గౌడ, నదియా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సాంగ్ స్నేక్ పీక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :