‘పుష్ప’లో ఆ సీన్ నగ్నంగా తీయాలనుకున్నాడట !

Published on Dec 27, 2021 8:00 am IST

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో అత్యంత ప్రతిష్టాత్మకంగా వచ్చిన ‘పుష్ప- ది రైజ్’ సినిమా గురించి తాజాగా సుకుమార్ సంచలన విషయాలు బయట పెట్టారు. బాలయ్య వ్యాఖ్యాతగా ప్రముఖ ఓటీటీ ఆహాలో ప్రసారమవుతున్న ‘అన్‌స్టాపపబుల్‌’ షోకి పుష్ప టీమ్ గెస్ట్ లుగా వచ్చారు. ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ.. ‘పుష్ప క్లైమాక్స్‌లో బన్నీ, ఫహాద్‌ ఇద్దరూ ప్యాంట్‌, షర్ట్‌ విప్పేసి ఒకరి పై ఒకరు ఛాలెంజ్ చేసుకుంటారు.

అయితే, ఆ సన్నివేశంలో సుకుమార్ మొదట ఇద్దరినీ నగ్నంగా చూపించాలని ప్లాన్ చేసుకున్నారట. కాకపోతే, తెలుగు ప్రేక్షకులకు ఇలాంటి బోల్డ్ సన్నివేశాలను అంతగా అంగీకరించరనే ఉద్దేశ్యంతో సుకుమార్ అప్పటికప్పుడు స్క్రిప్ట్ లో మార్పులు చేసి ఆ సన్నివేశాలను ఇప్పుడు ఉన్న విధంగా తీసారట. ఇక పుష్ప పార్ట్‌ 2లో ఇంతముమించి ఆసక్తికరమైన సీన్స్ ఉంటాయని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :