ఆ బ్రాండ్ భారీ ఆఫర్ ను తిరస్కరించిన బన్నీ..!

Published on Aug 10, 2022 4:28 pm IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్ప చిత్రం తర్వాత పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ఈ స్టార్ హీరో, ప్రస్తుతం పలు యాడ్ లలో నటిస్తున్నారు. ఒక్కో యాడ్ కి 7.5 కోట్ల రూపాయల తీసుకొనే బన్నీ, 10 కోట్ల రూపాయల యాడ్ కి నో చెప్పారు. గుట్కా మరియు మద్యం లకు సంబంధించిన బ్రాండ్ యాడ్ కోసం పెద్ద మొత్తాన్ని ఇచ్చేందుకు సిద్ధం అవ్వగా, బన్నీ సున్నితం గా తిరస్కరించాడు. ఈ న్యూస్ తో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

బన్నీ నెక్స్ట్ మూవీ పుష్ప ది రూల్ కోసం సిద్ధం అవుతున్నారు. ఈ రెండో పార్ట్ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొదటి పార్ట్ సెన్సేషన్ క్రియేట్ చేయగా, ఈ చిత్రం అంతకు మించి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అని ఆశిస్తున్నారు ఫ్యాన్స్. ఈ చిత్రం కి సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా, రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది.

సంబంధిత సమాచారం :