బన్నీ డెడికేషన్ చూసి ముచ్చటపడుతున్న అభిమానులు !

అల్లు అర్జున్ తాజా చిత్రం ‘నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా’ ఫిస్ట్ ఇంపాక్ట్ నిన్న సాయంత్రమే విడుదలైంది. రిలీజై 24 గంటలు కూడా గడవకముందే ఈ ఇంపాక్ట్ వీడియోకి సుమారు 1.7 మిలియన్ల వ్యూస్, 1.6 లక్షల లైక్స్ దక్కాయి. ఈ ఇంపాక్ట్ లో అభిమానుల్ని ఎక్కువగా ఆకట్టుకునే అంశం మేకోవర్ కోసం బన్నీ చూపెట్టిన డెడికేషన్.

సినిమాలో సోల్జర్ పాత్ర కోసం కొన్ని నెలల పాటు విదేశీ ట్రైనర్ల వద్ద శిక్షణ తీసుకున్న బన్నీ మంచి ఫిజిక్ తో, కొత్తగా, రఫ్ గా ఉండే హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ తో అందరినీ ఇంప్రెస్ చేసేశారు. అంతేగాక కంట్రోల్ చేసుకోలేనంత ఆవేశం కలిగిన సైనికుడిగా బన్నీ నటన ఫుల్ ఎనర్జీతో పవర్ ప్యాక్డ్ గా కనిపిస్తూ సినిమాపై అంచనాల్ని రెట్టింపు చేసింది.

యాక్షన్ తో పాటు మంచి మెసేజ్ తో రాబోతున్న ఈ చిత్రాన్ని రచయిత వక్కంతం వంశీ డైరెక్ట్ చేయగా విశాల్, శేఖర్ లు సంగీతం అందించారు. రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్ పై శిరీషా శ్రీధర్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 27న రిలీజ్ చేయనున్నారు.