రోడ్ పక్కన ఉన్న హొటల్ లో టిఫిన్ చేసిన బన్నీ

Published on Sep 13, 2021 12:22 pm IST


అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. అయితే కాకినాడ ప్రాంతం లో ఈ సినిమా షూటింగ్ ఉండటం తో బన్నీ అక్కడి వంటలను ఆస్వాదిస్తున్నారు. తాజాగా రోడ్ పక్కనే ఉన్న ఒక హోటల్ లో టిఫిన్ చేసి బయటికి వచ్చిన విడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారుతోంది.

గోకవరం దగ్గరి ప్రాంతం లో బన్నీ ఇలా టిఫిన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే బన్నీ చాలా సింపుల్ గా ఉండటం అందరినీ ఆకట్టుకుంటుంది. అంతేకాక అక్కడి వారికి బన్నీ టిప్ ఇచ్చిన విషయం కూడా తెలుస్తుంది. పుష్ప ది రైజ్ అంటూ మొదటి పార్ట్ ఈ ఏడాది డిసెంబర్ లో విడుదల కి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా రష్మీక మందన్న నటిస్తుంది. విలన్ పాత్రలో ఫాహద్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీప్రసాద్ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :