సూపర్ స్టార్ మాటతో కూల్ అయిన బన్నీ, మహేష్ ఫ్యాన్స్ !

31st, December 2017 - 04:15:02 PM

సూపర్ స్టార్ రజనీకాంత్, శంకర్ ల ‘2 పాయింట్ 0’ చిత్రాన్ని ముందుగా ఏప్రిల్ 27న రిలీజ్ చేస్తామని నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ప్రకటించింది. కానీ అదే తేదీని అల్లు అర్జున్ నటించిన ‘నా పేరు సూర్య’, మహేష్ చేస్తున్న ‘భరత్ అనే నేను’ సినిమాల రిలీజ్ డేట్ గా ముందుగానే నిర్ణయించి ఉండటంతో అభిమానుల్లో కొంత కలవరం మొదలైంది.

అసలే రెండు పెద్ద సినిమాలో ఒకే రోజు దిగుతూ ఓపెనింబగ్స్ కి ఇబ్బంది తలెత్తే పరిస్థితి ఉండగా మధ్యలో రజనీ లాంటి సూపర్ స్టార్ యొక్క ప్రతిష్టాత్మక చిత్రం ‘2పాయింట్0’ రావడం ఇంకా పెద్ద ఇబ్బందిగా మారుతుందని మదనపడ్డారు. పలువురు సినీ రన్గ పెద్దలు కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చుతూ రజనీ సినిమా రిలీజ్ డేట్ మారితే బాగుంటుందని అన్నారు.

అంతా ఆశించినట్టే చిత్రం 2018 ఏప్రిల్ 27న కాకుండా ఏప్రిల్ 14న రిలీజవుతున్నట్టు రజనీ నిన్న ప్రకటించారు. ఈ మార్పు వలన బన్నీ, మహేష్ ల సినిమాలు ఎలాంటి ఇబ్బందీ లేకుండా భారీ స్థాయిలో రిలీజ్ కానున్నాయి. దీంతో ఈ ఇద్దరు హీరోల అభిమానులు కూల్ అయిపోయారు.