బన్నీ – త్రివిక్రమ్ సినిమా సంక్రాంతికే !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కలయికలో వస్తోన్న సినిమా సెకండ్ షెడ్యూలకి సంబంధించిన షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది. అయితే ఈ సినిమా విడుదల తేదీ విషయంలో లేటెస్ట్ అప్ డేట్ తెలిసింది. ఇటీవలే ఈ సినిమా డిసెంబర్ లో వస్తోందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే చిత్రబృందం సమాచారం ప్రకారం సంక్రాంతికే ఈ సినిమా విడుదల చేయాలని.. జనవరి 11న గాని లేదా జనవరి 13న గాని సినిమా విడుదల ఉంటుందని తెలుస్తోంది.

ఇక ప్రస్తుతం జరుగుతున్న సెకెండ్ షెడ్యూల్ లో బన్నీతో పాటు సినిమాలోని మిగిలిన స్టార్ కాస్టింగ్ కూడా పాల్గొంటున్నారు. ఇక ఈ సినిమలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. పూజా హెగ్డే ఇప్పటికే డీజే సినిమాలో బన్నీ సరసన నటించింది. అలాగే ఈ సినిమాలో సుశాంత్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. అల్లు అర్జున్ కి తల్లిగా ఒకప్పటి హాట్ హీరోయిన్ టబు నటిస్తోంది. ఈ సినిమాను అల్లు అరవింద్ తో కలిసి చినబాబు నిర్మిస్తున్నారు.

Exit mobile version