అభిమానులను సర్‌ప్రైజ్ చేయనున్న బన్నీ!

allu-arjun

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు హీరోగా మంచి స్టార్ డమ్ సంపాదిస్తూ దూసుకుపోతున్నారు. ఇప్పటికే సరైనోడుతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టిన ఆయన, తాజాగా డీజే అన్న సినిమాతో మెప్పించేందుకు సిద్ధమవుతున్నారు. ఇక ఇదిలా ఉంటే నేడు క్రిస్‌మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని బన్నీ అభిమానులకు ఓ సర్‌ప్రైజ్ ప్లాన్ చేశారట. సాయంత్రం 4 గంటలకు ట్విట్టర్ ద్వారా అల్లు అర్జున్ స్వయంగా ఈ సర్‌ప్రైజ్‌ను విడుదల చేస్తారు.

మరి బన్నీ ఇచ్చే ఆ సర్‌ప్రైజ్ ఏమై ఉంటుందన్నది మాత్రం ఇప్పటికి సస్పెన్సే! ఆయన డీజే సినిమాలోని స్టిల్ గానీ, ప్రీ లుక్ గానీ విడుదల కావొచ్చని కొందరు అభిమానులు భావిస్తుంటే, ఈమధ్యే కూతురికి జన్మనిచ్చిన బన్నీ దంపతులు తమ కూతురి ఫోటోను అభిమానులతో షేర్ చేసుకోనున్నారన్న మరో ప్రచారం వినిపిస్తోంది. మరి ఆ సర్‌ప్రైజ్ ఏంటో తెలియాలంటే సాయంత్రం వరకూ ఎదురుచూడాల్సిందే!