ఆ బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ లో ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ క్రేజీ రిఫరెన్స్!

Published on Jul 22, 2022 11:30 pm IST

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ క్రేజ్ రోజురోజుకీ పెరిగిపోతోంది. పుష్ప ది రైజ్ తో ఇండియా ను షేక్ చేశాడు బన్నీ. ఈ ఐకానిక్ స్టార్ వరల్డ్ వైడ్ గా తన యాక్టింగ్ తో, డాన్స్ తో, యాక్షన్ సన్నివేశాలతో పాపులర్ అయ్యాడు. బాలీవుడ్ లో బన్నీ కి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. అయితే ఈ క్రేజ్ బాలీవుడ్ సినిమాలో రిఫరెన్స్ కి కూడా వాడుకోవడం జరిగింది.

బాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఏక్ విలన్ చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న ఏక్ విలన్ రిటర్న్స్ సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం లో జాన్ అబ్రహం, దిశా పటాని, అర్జున్ కపూర్, తారా సుతారియా లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ జూలై 29, 2022 న థియేటర్ల లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. అయితే ఈ చిత్రం నుండి తాజాగా విడుదల చేసిన ఒక సాంగ్ లో అల్లు అర్జున్ రిఫరెన్స్ ను తీసుకోవడం జరిగింది. అల వైకుంఠ పురం లోని ఒక ఫైట్ సన్నివేశానికి సంబందించిన సీన్ అది. ఆ మూమెంట్ కి దిశా డాన్స్ వేస్తుండటం విశేషం. ఫ్యాన్ గర్ల్ రీల్ లైఫ్ లో, రియల్ లైఫ్ లో డాన్స్ చేస్తుంది అంటూ కొందరు చెప్పుకొచ్చారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

సంబంధిత సమాచారం :