చరణ్ పంపిన స్వీట్ మెసేజ్ ను షేర్ చేసిన బన్నీ.!

Published on May 9, 2021 12:00 pm IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్న కోవిడ్ సెకండ్ వేవ్ మూలాన తాను కూడా పాజిటివ్ గా నిర్ధారణ కాబడ్డాడు. దీనితో అభిమానులు సహా ఇతర సినీ తారలు కూడా బన్నీ త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. మరి ఇదిలా ఉండగా అల్లు అర్జున్ బావ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ బన్నీ కోలుకోవాలని తనకి పంపిన మెసేజ్ ను బన్నీ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టి షేర్ చేసుకున్నారు.

ఆ మెసేజ్ లో చరణ్ బన్నీపై “నీ ఆరోగ్యం త్వరగా కుదుట పడాలని కోరుకుంటున్నాని అలాగే అంతే కాకుండా నీవు బాగున్నాక ఓసారి కలుద్దామని ప్రేమతో నీ చరణ్” అని ఓ లెటర్ ద్వారా తెలిజేయగా ఆ స్వీట్ మెసేజ్ ను బన్నీ తన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. దీనితో ఇద్దరి హీరోల అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం బన్నీ “పుష్ప”, చరణ్ “రౌద్రం రణం రుధిరం” అనే భారీ పాన్ ఇండియన్ సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :