మరొక ప్రోడక్ట్ కు బ్రాండ్ అంబాసిడర్ గా అల్లు అర్జున్ !

9th, January 2018 - 03:40:20 PM

సినిమాలతో పాటు వాణిజ్య ప్రకటనల్లో కూడా ఎక్కువగా కనిపించే తెలుగు హీరోల్లో అల్లు అర్జున్ కూడా ఒకరు. ఈయనకున్న ఫాలోయింగ్ దృష్ట్యా పలు దేశీ కంపెనీలు ఆయను తమ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకున్నాయి. ఇప్పటికే కోల్గెట్, రెడ్ బస్, హీరో మోటోకార్ప్, హాట్ స్టార్, 7 అప్, జాయ్ అలుక్కాస్ వంటి సంస్థలకు ప్రచార కార్గత వ్యవహరించిన బన్నీ ఇప్పడు మరొక కొత్త ప్రోడక్ట్ కు బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు.

అదే పార్లే ఆగ్రో వారి ఫ్రూటీ. దక్షిణాది మార్కెట్ మొత్తానికి బన్నీయే ప్రచారకర్తగా వ్యవహరిస్తారు. ఈ ఏడాది వేసవి నుండి ఈ క్యాంపైన్ మొదలుకానుంది. ఇకపోతే ప్రస్తుతం బన్నీ వక్కంతం వంశీ డైరెక్షన్లో ‘నా పేరు సూర్య’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఏప్రిల్ 27న ఈ చిత్రం రిలీజ్ కానుంది.