మెగాస్టార్ చిరుకి ఐకాన్ స్టార్ స్పెషల్ విషెస్!

మెగాస్టార్ చిరుకి ఐకాన్ స్టార్ స్పెషల్ విషెస్!

Published on Jan 26, 2024 4:00 PM IST

మెగాస్టార్ చిరంజీవి మరోమారు తెలుగు వారందరినీ గర్వ పడేలా చేశారు. ప్రతిష్టాత్మకమైన పద్మ విభూషణ్ ను అందుకున్నారు. ఈ మేరకు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సినీ పరిశ్రమ కి చెందిన పలువురు ప్రముఖులు విష్ చేస్తున్నారు. ఆ లిస్ట్ లోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేరిపోయారు. మెగాస్టార్ చిరంజీవికి వచ్చిన అవార్డ్ పట్ల సంతోషం వ్యక్తం పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ప్రతిష్టాత్మకమైన పద్మవిభూషణ్‌ ను అందుకున్నందుకు మా మెగాస్టార్ గారికి అభినందనలు. కుటుంబానికి, అభిమానులకు మరియు తెలుగు ప్రజలకు ఎంత గౌరవం. ఈ విజయంతో నేను చాలా ఉల్లాసంగా మరియు గౌరవంగా భావిస్తున్నాను. మా అందరినీ చాలా గర్వించేలా చేసినందుకు ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చారు బన్నీ. ఈ ఇంట్రెస్టింగ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బన్నీ షేర్ చేసిన ఫోటో సైతం ఆడియెన్స్ ను విశేషం గా ఆకట్టుకుంటుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు