తిరిగి షూటింగ్ మొదలుపెట్టనున్న అల్లు అర్జున్ !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నూతన దర్శకుడు, రచయిత వక్కంతం వంశీ డైరెక్షన్లో ‘నా పేరు సూర్య’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తికాగా బన్ని సెలవులు తీసుకుని ప్రస్తుతం క్రిస్టమస్, న్యూ ఇయర్ వేడుకల్లో ఉన్నారు. అవి ముగియగానే ఆయన తిరిగి షూటింగ్లో జాయిన్ కానున్నారు.

ఈ కొత్త షెడ్యూల్ జనవరి 4 నుండి మొదలవుతుంది. బన్నీ ఆర్మీ అధికారిగా కనిపించనున్న ఈ చిత్రణపై అభిమానులు, ప్రేక్షకుల్లో తారా స్థాయి అంచనాలున్నాయి. లగడపాటి శ్రీధర్ నిర్మాణంలో నాగబాబు సమర్పిస్తున్న ఈ చిత్రానికి బాలీవుడ్ సంగీత దర్శకులు విశాల్, శేఖర్ లు సంగీతాన్ని అందిస్తున్నారు. ఇందులో అల్లు అర్జున్ కు జోడీగా అను ఇమ్మాన్యుయేల్ నటిస్తోంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 27న రిలీజ్ చేయనున్నారు.