బన్నీతో సినిమా ప్లాన్ చేస్తున్న కొరటాల?

బన్నీతో సినిమా ప్లాన్ చేస్తున్న కొరటాల?

Published on Dec 20, 2021 8:00 PM IST

క్లాస్ డైరెక్టర్ కొర‌టాల శివ‌ అల్లు అర్జున్ తో సినిమా చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ తో సినిమా పూర్తి అయిన తర్వాత, కొరటాల బన్నీతో సినిమా ప్లాన్ చేస్తాడట రచయితగా ఉన్న సమయలోనే బన్నీకి కొరటాల ఓ కథ చెప్పాడని, ఆ కథనే ఇప్పుడు సినిమాగా చేయాలనుకుంటున్నాడని ఆ రూమర్స్ తాలూకు సారాంశం. మరి ఈ రూమర్స్ లో వాస్తవం ఉందో చూడాలి.

కాకపోతే కొరటాల ఇండ్ర‌స్ట్రీలో ఉన్న ప్ర‌తి స్టార్ హీరోతోనూ ఓ సినిమా చేయాల‌ని ప్లాన్ చేసుకున్నాడు. అందుకే, జూనియర్ ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా అనంతరం, కొరటాల బన్నీతోనే సినిమా చేస్తాడని వార్తలు వస్తున్నాయి. మరి హీరోల ఇమేజ్ ను బట్టి కథలు రాసే కొరటాల, బన్నీ కోసం ఎలాంటి కథ రాశాడో. ఏది ఏమైనా వీరి కలయికలో వచ్చే సినిమా పై భారీ అంచనాలు ఉంటాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు