“పక్కా కమర్షియల్” కంప్లీట్ ఎంటర్ టైనర్ – నిర్మాత బన్నీ వాసు

Published on Jun 11, 2022 12:00 am IST

గోపీచంద్ హీరోగా, రాశి ఖన్నా హీరోయిన్ గా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ పక్కా కమర్షియల్. ఈ చిత్రం ను జులై 1, 2022 న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ మేరకు చిత్రం కి సంబంధించిన పలు విషయాలను నిర్మాత బన్నీ వాసు వెల్లడించారు.
లాస్ట్ 3 ఇయర్స్ నుండి కరోనా కారణం గా అన్ని ఆగిపోయాయి. మళ్ళీ రీ స్టార్ట్ అవ్వడం తో సినిమాలు కూడా అదే విధంగా ఒక వేవ్ లా వచ్చాయి. మా సంస్థ జీఏ2 నుండి వచ్చే మూవీస్ కూడా ఈ జులై ఫస్ట్ పక్కా కమర్షియల్ చిత్రం తో మొదలు పెట్టి, దసరా లోపు చిత్రాలను రిలీజ్ చేస్తాం. పక్కా కమర్షియల్ కంప్లీట్ ఎంటర్ టైనర్. మారుతి చాలా ఎంటర్ టైన్మెంట్ గా చేయడం జరిగింది. గోపి మరియు రాశి లు చాలా బాగా చేశారు.

ఇప్పుడున్న ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చాలా బాగా ఆదరిస్తారు. పక్కా కమర్షియల్ చిత్రం కంప్లీట్ ఎంటర్ టైనర్. కథ, బ్రిలియన్స్ చూపించాలి అని అనుకోవడం లేదు, లైటర్ మెసేజ్ ఉంటుంది కానీ, నాట్ ఏ మెసేజ్ ఓరియెంటెడ్. 18 పేజెస్ సెప్టెంబర్ లో రిలీజ్ చేద్దాం అని చూస్తున్నాం. అదే విధంగా దసరా కి మరో చిత్రం రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నాం. ఆగస్ట్ లో మరో సినిమా రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నాం.

గీత ఆర్ట్స్2 నుండి వచ్చే సినిమాలు అన్ని కూడా చాలా ఎంటర్ టైనర్స్. థియేటర్ల లో చూసే సినిమాలు అవి. టికెట్స్ రేట్లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుకూలం గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో నార్మల్ టికెట్ రేట్ల తో సినిమా ఉండేలా ప్లాన్ చేశాం. జీఎస్టీ తో కలిపి కామన్ పీపుల్ కు అందుబాటులో ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నాం.

సినిమా కి ఏదైనా నష్టం వస్తే, హీరోలు, నిర్మాతలు మళ్ళీ డిస్ట్రిబ్యూటర్ లకు సహాయం చేస్తున్నారు. నార్త్ సినిమా దెబ్బ తినడానికి కారణం ఎక్కువగా ప్రొడక్ట్ తో పాటుగా రెమ్యునరేషన్ లు కూడా తీసుకోవడం. ఏదైనా అయితే ఫైనల్ గా దెబ్బ తినేది నిర్మాత నే. 2019 నుండి 20 కి నిర్మాతల్లో, ఆడియెన్స్ లో చాలా మార్పు వచ్చింది.

నా జర్నీ లో ఎక్కువగా ఎంటర్ టైనర్ లు ఉంటాయి. కానీ, థియేటర్ల లోకి ఆడియెన్స్ ను తీసుకు రావాలంటే, బిగ్ ఫిల్మ్స్ చేయాలి. ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకొని తీయాలి. క్యారెక్టరైజేషన్ చాలా ముఖ్యం.

అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత చాలా ప్రపోజల్స్ ఉన్నాయి. ఆయన టైమ్ షెడ్యూల్స్ చాలా చేంజ్ అయ్యాయి. నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కి పుష్ప వస్తది. ఈ దసరా కి కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. సంజయ్ లీలా భన్సాలీ కి పుష్ప నచ్చడం తో అల్లు అర్జున్ ను కలవడం జరిగింది. వేరే కారణాలు ఏమి లేవు.

సంబంధిత సమాచారం :