మెగాస్టార్ తో కమర్షియల్ మూవీ పక్కా – బన్నీ వాసు

Published on Jul 2, 2022 7:05 pm IST

టాలీవుడ్ లో ప్రస్తుతం యువ నిర్మాతగా పలు సక్సెస్ఫుల్ సినిమాలు చేస్తూ కొనసాగుతున్నారు బన్నీ వాసు. లేటెస్ట్ గా గీత ఆర్ట్స్ 2, యువి క్రియేషన్స్ బ్యానర్స్ పై తెరకెక్కిన పక్కా కమర్షియల్ మూవీ ని ఎంతో గ్రాండ్ గా నిర్మించిన బన్నీ వాసు, దానితో కూడా విజయం అందుకున్నారు. గోపీచంద్, రాశి ఖన్నాల కాంబినేషన్ లో మారుతీ తీసిన పక్కా కమర్షియల్ మూవీ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రస్తుతం సక్సెస్ఫుల్ టాక్ తో కొనసాగుతోంది.

అయితే మూవీ రిలీజ్ సందర్భంగా ప్రత్యేకంగా మీడియా కి ఇంటర్వ్యూ ఇచ్చిన బన్నీ వాసు, మాట్లాడుతూ తనకు ఎంతో ఇష్టమైన నటుల్లో మెగాస్టార్ ముఖ్యులని, తనకు సినీ లైఫ్ ఇచ్చిన అల్లు అరవింద్ నిర్మాణ సారధ్యంలో తాను నిర్మాతగా రాబోయే రోజుల్లో తప్పకుండా మెగాస్టార్ తో ఒక అద్భుతమైన సినిమా తీస్తాం అన్నారు. అలానే అది తప్పకండా ఆడియన్స్ తో పాటు మెగాఫ్యాన్స్ అందరి అంచనాలు అందుకునేలా పక్క కమర్షియల్ ఫార్మాట్ లో ఉంటుందని, దాని గురించి అన్ని వివరాలు కొన్ని నెలల తరువాత వెల్లడి అవుతాయని అన్నారు బన్నీ వాసు.

సంబంధిత సమాచారం :