బన్నీ ‘నా పేరు సూర్య’ షూటింగ్ అప్డేట్ !
Published on Oct 8, 2017 11:27 am IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అను ఇమ్మానుయేల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘నా పేరు సూర్య’. దేశభక్తి నైపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని రచయిత వక్కంతం వంశీ డైరెక్ట్ చేస్తున్నారు. హైదరాబాద్లోనే రెండు షెడ్యూళ్లను ముగించుకున్న ఈ చిత్రం గత నెల 24న ఊటీలో ఒక షెడ్యూల్ ను మొదలుపెట్టింది. కీలక సన్నివేశాల చిత్రీకరణ కలిగిన ఈ షెడ్యూల్ ఈ నెల 10వ తేదీకి ముగిస్తుందని, అనంతరం టీమ్ హైదరాబాద్ కు తిగిగి వస్తారని తెలుస్తోంది.

శిరీష్, శ్రీధర్ లగడపాటి, బన్నీ వాసులు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 27న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో ఆర్మీ అధికారిగా కనిపించనున్న అల్లు అర్జున్ ఖచ్చితమైన లుక్ కోసం యూఎస్ ట్రైనర్ల వద్ద కఠినమైన శిక్షణ తీసుకుంటున్నాడు. యాక్షన్ కింగ్ అర్జున్, శరత్ కుమార్ వంటి సీనియర్ స్టార్ నటులు నటిస్తున్న ఈ ప్రాజెక్టుకు విశాల్ – శేఖర్ సంగీతాన్ని అందిస్తున్నారు.

 
Like us on Facebook