ఆగష్టు నుండి బన్నీ ‘నా పేరు సూర్య’ !
Published on Jul 16, 2017 9:51 am IST


‘దువ్వాడ జగన్నాథమ్’ తో మంచి సక్సెస్ ను అందుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన తర్వాతి సినిమా ‘నా పేరు సూర్య’ కు సిద్ధమవుతున్నారు. రచయిత నుండి దర్శకుడిగా మారుతున్న వక్కంతం వంశీ డైరెక్ట్ చేయనున్న చిత్రం ఆగష్టు మొదటి వారం నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది.

దేశభక్తి నైపథ్యంలో నడిచే ఈ సినిమాలో బన్నీ ఇదివరకెన్నడూ కనిపించని క్యారెక్టరైజేషన్లో కనిపిస్తారని తెలుస్తోంది. ఈ చిత్రంలో బన్నీ సరసన అను ఇమ్మాన్యుయేల్ ను కథానాయకిగా తీసుకోవాలనే చర్చలు జరుగుతుండగా ఇంకా ఫైనల్ డెసిషన్ బయటకురాలేదు. ఇకపోతే లగడపాటి శ్రీధర్, నాగబాబులు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి విశాల్ – శేఖర్ సంగీతం అందిస్తుండగా ప్రముఖ సినిమాటోగ్రఫర్ రాజీవ్ రవి కెమెరా వర్క్ చేయనున్నారు. 2018 సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.

 
Like us on Facebook