మార్చి నుండి మొదలుకానున్న అల్లు అర్జున్ కొత్త చిత్రం ?


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం వక్కంతం వంశీ డైరెక్షన్లో ‘నా పేరు సూర్య’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యే మొదలైన ఈ చిత్ర షూటింగ్ పూర్తవడానికి కాస్త ఎక్కువ సమయమే పడుతుంది. దీని తర్వాత బన్నీ తమిళ దర్శకుడు లింగుస్వామి డైరెక్షన్లో ఒక చిత్రాన్ని చేయనున్నాడు. గత ఏడాది అధికారికంగా లాంచ్ అయిన ఈ సినిమాతో బన్నీ తమిళంలో కూడా ఆరంగేట్రం చేయనున్నాడు.

రెండు భాషల్లోనూ ఒకేసారి రూపుదిద్దుకోనున్న ఈ ప్రాజెక్టును వచ్చే ఏడాది మార్చి నుండి మొదలుపెడతారని సమాచారం. అయితే ఈ వార్తపై ఇంకా చిత్ర టీమ్ నుండి అధికారిక సమాచారం వెలువడలేదు. ఇకపోతే ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ నిర్మిస్తుండగా ఇందులో హీరోయిన్ ఎవరు, చిత్రం ఎలా ఉండబోతోంది అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.