కొత్త సినిమాని ప్రారంభించనున్న అల్లు అర్జున్ !
Published on Jun 7, 2017 12:32 pm IST


‘దువ్వాడ జగన్నాథం’ సినిమా పనుల్లో బిజీగా ఉన్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త్వరలో తన కొత్త ప్రాజెక్టుని మొదలుపెట్టనున్నారు. ఎన్నాళ్లగానో దర్శకుడిగా మారాలని ట్రై చేస్తున్న ప్రముఖ రచయిత వక్కంతం వంశీ దర్శకత్వంలో ఈ సినిమా ఉండనుంది. మొదట ఎన్టీఆర్ తో సినిమా చేయాలనుకున్న వంశీ ఆ ప్రాజెక్ట్ కుదరకపోవడంతో బన్నీ కోసం కొత్త కథ రాసుకుని సినిమాకు సిద్ధమయ్యారు. జూన్ 21 న హైదరాబాద్లో ఈ సినిమా లాంఛనంగా మొదలుకానుందని సినీ వర్గాల సమాచారం.

లగడపాటి శ్రీధర్, నాగబాబు నిర్మించనున్న ఈ సినిమాలో వంశీ బన్నీని సరికొత్త క్యారెక్టరైజేషన్లో చూపించనున్నారని వినికిడి. ఈ చిత్రంలో హీరోయిన్, ఇతర తారాగణం, సాంకేతిక నిపుణులు ఎవరనే వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. ఇకపోతే హరీష్ శంకర్ డైరెక్షన్లో బన్నీ చేస్తున్న ‘డీజే’ ఈ జూన్ నెల 23న భారీ స్థాయిలో విడుదలకానుంది. టీజర్, పాటలు, ట్రైలర్ అన్నీ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై భారీ స్థాయి అంచనాలున్నాయి.

 
Like us on Facebook