బాక్స్ ఆఫీస్ షేక్ చేయబోతున్న సూర్య భాయ్ ?

ప్రిన్స్ మహేష్ బాబు నటించిన హై వోల్టేజ్ చిత్రం ‘బిజినెస్ మేన్’. ఈ చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా అత్యంతా భారీగా విడుదల కాబోతుంది. ఈ చిత్రం రిలీజ్ కి ముందే సంచలనాలు సృష్టిస్తుంది. మహేష్ బాబు పంచ్ డైలాగులు మరియు మహేష్ కూల్ లుక్ యువతను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. కాజల్ గ్లామర్ కూడా అదనపు ఆకర్షణగా నిలవనుంది. మహేష్ సూర్య భాయ్ గా తన బలంతో అండర్ వరల్డ్ ని ఎలా భాయ్ అయ్యాడు అనేది చిత్ర కథ. ఈ చిత్రం ముంబై మరియు గోవాలలో చిత్రీకరించారు. ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో థియేటర్లలో విడుదల చేస్తుండటం సంక్రాంతి సెలవులు కూడా కలిసి వస్తుండటంతో ఓపెనింగ్స్ భారీగానే ఉండబోతున్నాయి. మొదటి రోజు మంచి టాక్ సంపాదించుకుంటే బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సూర్య భాయ్ మరోసారి బాక్స్ ఆఫీస్ రారాజు గా నిలుస్తడా లేదా అనేది రేపు తెలుస్తుంది.

దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద ఉన్న కామెంట్ బాక్స్ లో తెలపండి.

Exit mobile version