తనతో అనుచితంగా ప్రవర్తించే హక్కు ఎవరికీ లేదన్న మహేష్ హీరోయిన్ !


తెలుగులో ‘దేవాదాసు’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత మహేష్ సూపర్ హిట్ సినిమా ‘పోకిరి’ తో స్టార్ హీరోయిన్ గా మారిపోయిన నటి ఇలియానా ప్రస్తుతం బాలీవుడ్లో సెటిలయ్యారు. కేవలం అక్కడి సినిమాలను మాత్రమే చేస్తున్న ఆమె తరచు తన అభిప్రాయాల్ని సోషల్ మీడియాలో నిర్మొహమాటంగా తెలుపుతూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తాజాగా ఆమె తన పట్ల అనుచితంగా ప్రవర్తించిన వ్యక్తిని ఉద్దేశించి చేసిన ట్వీట్లు హాట్ టాపిక్ గా మారాయి.

ట్విట్టర్లో ఆమె స్పందిస్తూ ‘మనం ఎంత వింత ప్రపంచంలో జీవిస్తున్నాం. నేనొక పబ్లిక్ ఫిగర్. నాకు లగ్జరీ ప్రైవేట్ లైఫ్ ఉండదని నాకు తెలుసు. కానీ నాతో అనుచితంగా ప్రవర్తించే హక్కు ఎవరికీ లేదు. అభిమానులు దీని పట్ల కన్ఫ్యూజ్ అవ్వొద్దు. ఏది ఏమైనా చివరికి నేను స్త్రీని’ అన్నారు. అయితే ఇలియానా ఇంత తీవ్రంగా స్పందించడం వెనుక అసలు కారణం ఏమిటో ఇంకా బయటకురాలేదు.