మరో అరుదైన రికార్డ్ సృష్హ్టించిన “బుట్ట బొమ్మ” సాంగ్..!

Published on Nov 14, 2021 2:18 am IST


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో గత ఏడాది వచ్చిన చిత్రం అల వైకుంఠపురములో. సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టించిన ఈ సినిమా సాంగ్స్, డ్యాన్స్‌లు కూడా హైలెట్‌గా నిలిచాయి.

అయితే ఈ సినిమాలోని బుట్ట బొమ్మ వీడియో సాంగ్‌కి ముందు నుంచే ఎనలేని క్రేజ్ వచ్చింది. యూట్యూబ్‌లో ఎక్కువ మంది వీక్షించిన తెలుగు వీడియో సాంగ్‌గా నిలిచి చెదిరిపోని రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే టాలీవుడ్ నుంచి అత్యధికంగా 700 మిలియన్ల వీక్షణలతో పాటు, 4.4 మిలియన్ల లైక్‌లతో సరికొత్త రికార్డ్ సెట్ చేసింది.

సంబంధిత సమాచారం :

More