ఇంట్రెస్టింగ్ గా “బుట్టబొమ్మ” ట్రైలర్.!

Published on Jan 28, 2023 11:11 am IST

లేటెస్ట్ గా టాలీవుడ్ లో రిలీజ్ కి సిద్ధం అవుతున్న పలు చిత్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి వస్తున్న మిడ్ రేంజ్ చిత్రం “బుట్టబొమ్మ” కూడా ఒకటి. టాలీవుడ్ కి కాస్త ఫ్రెష్ ఫీల్ ఇస్తూ చేసిన ఈ చిత్రం నుంచి మేకర్స్ ఇప్పుడు థియేట్రికల్ ట్రైలర్ ని రిలీజ్ చేసారు. అనిక సురేంద్రన్ మరియు సూర్య వశిష్ట లు మెయిన్ లీడ్ లో నటించగా మరో టాలెంటెడ్ నటుడు అర్జున్ దాస్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించాడు.

మరి ఈ ట్రైలర్ అయితే మంచి ఎంగేజింగ్ గా ఉందని చెప్పాలి. బ్యూటిఫుల్ సెటప్ లో నడిచే క్లీన్ లవ్ స్టోరీ డీసెంట్ గా ఉండగా ఇందులో క్యాస్టింగ్ మరింత ఆసక్తిగా కనిపించడం విశేషం. వీటితో పాటుగా మెయిన్ లీడ్ మధ్య మంచి కెమిస్ట్రీ దానితో పాటుగా అర్జున్ దాస్ పాత్రపై సస్పెన్స్ వంటివి ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి.

ఇక ఈ ట్రైలర్ గోపి సుందర్ మ్యూజిక్ కూడా సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా బాగుంది. ఇక సితార ఎంటర్టైన్మెంట్స్ వారి నిర్మాణ విలువలు కోసం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొత్తానికి అయితే దర్శకుడు చంద్రశేఖర్ టి రమేష్ మంచి వర్క్ నే ఈ చిత్రానికి అందించాడు. ఇక ఫిబ్రవరి 4న రిలీజ్ అయ్యే సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :