‘అజ్ఞాతవాసి’ ఆడియోకు ముఖ్య అతిథులు వీళ్లేనా ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం ‘అజ్ఞాతవాసి’ ఆడియో వేడుక రేపు సాయంత్రం హైదరాబాద్లోని నోవాటెల్ హోటల్లో భారీ ఎత్తున జరుగునుంది. ఇప్పటికే ఏర్పాట్లన్నీ ముమ్మరంగా జరుగుతుండగా ఎంట్రీ పాస్ లకు గట్టి డిమాండ్ నెలకొంది. ఇకపోతే ఈ వేడుకకు అతిథులుగా విక్టరీ వెంకటేష్, ఎన్టీఆర్ లు హాజరవుతారని ఫిల్మ్ నగర్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే నిర్మాతలు మాత్రం ఈ విషయంపై ఇంకా పెదవి విప్పలేదు.

నిర్మాణ సంస్థ హారికా అండ్ హాసిని క్రియేషన్స్ నెస్ట్ సినిమాల్లో ఒకటి ఎన్టీఆర్ తో కాగా ఇంకొకటి వెంకటేష్ తో ఉండనుంది. ఈ రెండు చిత్రాలకు దర్శకుడు త్రివిక్రమే. పైగా కొద్దిరోజుల క్రితమే జరిగిన ఎన్టీఆర్ సినిమా ప్రారంభోత్సవానికి పవన్ ముఖ్య అతిథిగా వెళ్లారు, అలాగే ‘అజ్ఞాతవాసి’ చిత్రంలో వెంకీ కాసేపు మెరవనున్నారు. ఈ అంశాలన్నిటినీ బట్టి చూస్తే ఇప్పుడు వినిపిస్తున్న గుసగుసలే రేపు వాస్తవమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.